రోమాంటిక్ హీరోకు తీవ్ర గాయాలు.. షాక్‌లో జీ2 మూవీ యూనిట్!

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీ మరోసారి వార్తల్లో నిలిచారు. హష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న గూడాచారి 2 మూవీ సెట్స్ నుండి హృదయవిదారక ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ కావడంతో అభిమానులు చాలా కంగారు పడ్డారు. ఇమ్రాన్ హష్మీ బాగున్నాడా? లేదా? ఇంతకీ ఆయనకు ఏమైంది ? ఆరా తీసున్నారు. అసలేం జరిగిందో ఓ లూక్కేద్దాం

బాలీవుడ్ రోమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ మెడ పై తీవ్రంగా గాయమైనట్టు, రక్తం కారుతున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అతని ఆరోగ్య పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అభిమానులు. అసలేం జరిగిందంటే.. ఇమ్రాన్ హష్మీ 'గూడాచారి 2' సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

Bollywood actor Emraan Hashmi injury at Goodachari 2 shoot in Hyderabad

గత సోమవారం (అక్టోబర్ 7) నాడు'గూడాచారి 2' షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు.. ఇమ్రాన్ హష్మీ మెడకు గాయమైందనీ, అది కొంచెం లోతుగా గాయమైతే.. అతడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. జంప్ సీక్వెన్స్‌లో ఇమ్రాన్ మెడపై తీవ్ర గాయమైందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ హష్మీ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఒక ఫోటోలో నటుడి గాయం స్పష్టంగా కనిపిస్తుంది. మరొక దానిలో ఇమ్రాన్ హష్మీ మెడకు కట్టు కనిపిస్తుంది.

ఇమ్రాన్ హష్మీ పరిస్థితి చూసి అభిమానుల తీవ్రంగా ఆందోళన చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు. నటుడు హష్మీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.స్వయంగా తాను డిజైన్ చేసుకున్న ఒక యాక్షన్ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడే గాయ పడ్డట్లు తెలుస్తుంది. ఇమ్రాన్ హష్మీ చికిత్స పొందుతున్నారనీ, ఇమ్రాన్ హష్మీ త్వరలో షూటింగ్‌కి తిరిగి రావచ్చని మూవీ యూనిట్ భావిస్తోంది.

Bollywood actor Emraan Hashmi injury at Goodachari 2 shoot in Hyderabad

ఇక 'గూడాచారి 2' మూవీ గురించి వస్తే.. ఈ చిత్రంలో ఇమ్రాన్‌తో పాటు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్ తన కొత్త సినిమా గురించి అభిమానులకు శుభవార్త అందించాడు. శోభిత ధూళిపాళ, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రల్లో నటించిన ఆదివాసీ శేష్ బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు చిత్రం 'గూడాచారి'కి సీక్వెల్ 'జి2'. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' మూవీలోనూ నటిస్తున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఈ మూవీలో 'ఓమి భౌ' అనే విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X