చాణక్య: సాలిడ్ కంటెంటుతో వస్తున్న గోపీచంద్
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.
'చాణక్య' సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ చిత్రాన్ని దసరాకుకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్‌కు సరైన హిట్ పడి చాలా కాలం అయింది. ఈ సినిమాతో అతడు మళ్లీ ఫాంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గోపీచంద్ చేసిన సినిమాలన్నింటికంటే ఇది భిన్నంగా ఉంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రంలో గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంక, కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు.


Click it and Unblock the Notifications











