twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు కోసం బిగ్‌బాస్ సెట్ రీ మోడలింగ్.. మకాం మార్చబోతున్న మెగా టీమ్

    |

    మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కుచ్చ సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకొని చివరి దశ షూటింగ్‌లో ఈ చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది. ఈ భాగాన్ని కోకాపేట లోని చిరంజీవి ఫామ్ హౌస్‌లో భారీ సెట్ వేసి చిత్రీకరిస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సెట్ అంతా కాలిపోయి భారీ నష్టం వాటిల్లడంతో ఇక మిగిలిన భాగాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎకర్స్‌లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం అక్కడి బిగ్‌బాస్ సెట్‌ను పునరుద్ధరించి అదే సెట్‌పై భారీగా యాక్షన్ సన్నివేశాలు, ఓ పాటను చిత్రీకరించనున్నారని తాజా సమాచారం. ఈ సెట్ కోసం 2 కోట్ల మేర ఖర్చు చేశారని తెలుస్తోంది.

    Chirajeevis Sye Raa Narasimha Reddy shoot in BigBoss sets

    తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ కెరీర్‌లో తొలి హిస్టారికల్ మూవీ కావడం ఈ సినిమా ప్రత్యేకత. ఖర్చుకు ఏ మాత్రం సందేహించకుండా భారీ మొత్తం కేటాయించి చిత్రానికి అన్ని హంగులు జోడిస్తున్నారు రామ్ చరణ్. చిత్రంలో మునుపెన్నడూ చూడని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చూపించనున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ప్రాథమిక సమాచారం. కాగా చిత్రాన్ని అనుకున్న సమయాని కంటే ముందుగా అంటే అక్టోబర్ 2 వ తేదీనే విడుదల చేయబోతున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    Megastar Chirajeevi 151 movie Sye Raa Narasimha Reddy is on final schedule shooting. Recently has Fire Accident on Sy Raa sets kokapet. Then that shooting spot is changed to Annapurna Studios. In Annapurna studios re modeling the big boss set for syraa final song shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X