సైరాలో అన్నీ.. తమన్నా, నయనతారలతో చిరు రొమాన్స్!
Recommended Video
మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి భారీ హంగులతో తెరకెక్కుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చుకుకుంటున్నారట డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

వికారాబాద్ అడవుల్లో
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తవ్రలో వికారాబాద్ అడవులకు పయనం కానుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించి ఆ వెంటనే అన్నపూర్ణ 7 ఎకర్స్ కి వచ్చేలా ప్లాన్ చేశారు యూనిట్ సభ్యులు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరు రొమాన్స్
వికారాబాద్‌లో షూటింగ్ పూర్తిచేసుకొని చివరగా అన్నపూర్ణ 7 ఎకర్స్‌కి చేరుకుంటుంది సైరా యూనిట్. ఇక్కడ చిత్రంలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. చిత్రానికి స్పెషల్ డోస్ ఇచ్చే ఈ సన్నివేశాల్లో చిరు, నయన్ రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే అక్కడ నిర్మించిన ప్రత్యేక సెట్‌లో తమన్నాతో కలిసి చిరు ఓ పాటకు స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పార్ట్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

అగ్నిప్రమాదం, అడ్డంకులు
సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ మొదలైన నాటినుంచి ఎదో ఒక అడ్డంకి షూటింగ్‌కి అంతరాయం కలిగిస్తూనే ఉంది. గతంలో ప్రభుత్వ స్థలంలో సెట్ వేశారనే ఆరోపణలతో కొన్నిరోజులు బ్రేక్ రాగా.. ఇటీవలే కోకాపేటలోని సైరా సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గని చిత్రయూనిట్ అనుకున్న సమయానికే చిత్రాన్ని విడుదల చేయనుంది.

స్వాతంత్ర దినోత్సవం రోజే..
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి ఆగస్టు 15 న విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో చిరుతో కలిసి అనుష్క కనిపించనుంది.


Click it and Unblock the Notifications











