Bhola Shankar: లీకైన భోళా శంకర్ సాంగ్ వీడియో.. ఆ సినిమాలోలా రొమాంటిక్‌గా!

రాజకీయాల కోసం సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. 'ఖైదీ నెంబర్ 150'తో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత నుంచి వరుస పెట్టి మూవీల మీద మూవీలు చేస్తోన్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను అందించిన ఆయన.. గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే మూవీతో వచ్చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన సొంతమైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా దక్కాయి. ఫలితంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీని మొదలు పెట్టారు. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ దర్శకుడిగా చెడ్డ పేరును తెచ్చుకున్న మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇక, ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ వీడియో బయటకు వచ్చింది.

Bhola Shankar

'భోళా శంకర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం స్విడ్జర్లాండ్‌లో జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మధ్య అదిరిపోయే లోకెషన్లలో సాంగ్‌ను షూట్ చేస్తోన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మెయిన్ లీడ్ మధ్య రొమాంటిక్ స్టెప్పులు కనిపిస్తున్నాయి. ఇక, ఈ సాంగ్ కూడా మంచి నెంబర్‌తో సాగుతున్నట్లు ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. మొత్తంగా ఇది 'ఠాగూర్' మూవీలోని చిన్నగ చిన్నగా చిన్నగా అనే పాటను గుర్తు చేసేలా ఉంది.

మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X