twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'ఏఎంబీ'లో తారల సందడి.. చిరు, సమంత, బాలయ్య.. ఎన్టీఆర్ ఇక్కడ గొప్పగా ఉంది!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 2న గచ్చిబౌలిలో మహేష్ బాబు తన ఏఎంబి సినిమాస్ మల్టిఫ్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఏఎంబి సినిమాస్ లాంచ్ అయింది. ఇప్పుడిప్పుడే ఎంఎబి సినిమాస్ కు తరాల సందడి పెరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, సమంత ఇలా సినీ ప్రముఖులంతా ఎంఎబి సినిమాస్ ని విజిట్ చేస్తున్నారు.

    ఎన్టీఆర్ కోసం బాలయ్య

    ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైన సందర్భంగా బాలయ్య, దర్శకుడు క్రిష్ ఎంఎబి సినిమాస్ ని సందర్శించారు. అభిమానులతో కలసి కథానాయకుడు చిత్రాన్ని చూశారు. క్రిష్ మాట్లాడుతూ చాలా థియేటర్స్ లో ఎన్టీఆర్ చిత్రం మేము అనుకున్న విధంగా రాలేదు. కానీ ఇక్కడ మాత్రం సౌండ్ సిస్టమ్, విజిబులిటీ అంతా అద్భుతంగా ఉందని క్రిష్ తెలిపాడు.

    మణికర్ణిక చిత్రం చూసిన చిరు, సమంత

    ఇక మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ కలసి ఎంఎబి సినిమాస్ లో కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రాన్ని ఏఎంబి సినిమాస్ లో చూశారు. మహేష్ థియేటర్ లో ఉన్న సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీకి చిరు మంత్రముగ్దులయ్యారు. సమంత కూడా ఏఎంబి సినిమాస్ లోనే మణికర్ణిక చిత్రాన్ని చూసింది.

    సెలెబ్రిటీలంతా

    దిల్ రాజు, శర్వానంద్, పరుచూరి గోపాల కృష్ణ లాంటి సెలెబ్రిటీలంతా ఎంఎబి సినిమాస్ ని సందర్శించారు. అత్యాధునిక, హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన ఏఎంబి సినిమాస్ ని కొనియాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ తాను దుబాయ్ లో ఉన్నానా లేక ఇండియాలో నా అని అన్నారు. అంత అద్భుతంగా ఏఎంబి సినిమాస్ ఉందని కీరవాణి ప్రశంసించారు.

    సరికొత్త అనుభూతి కలిగేలా

    సరికొత్త అనుభూతి కలిగేలా

    ఎంఎబి సినిమాస్ ని ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలిగేలా నిర్మించారు. ప్రేక్షకులు మరో లోకంలోని వెళ్లిన అనుభూతి ఎంఎబి సినిమాస్ ద్వారా కలుగుతుంది. మహేష్ బాబు తెలుగురాష్ట్రాలలో అన్ని నగరాలలో ఏఎంబి సినిమాస్ ని విస్తృతపరచనున్నట్లు తెలుస్తోంది. రీల్ లైఫ్ లో బిజినెస్ మాన్ గా అదరగొట్టిన మహేష్ రియల్ లైఫ్ లో కూడా తాను బెస్ట్ బిజినెస్ మాన్ అనిపించుకుంటున్నాడు.

    English summary
    Chiranjeevi, Samantha Akkineni watch Manikarnika in Mahesh Babu's AMB Cinemas
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X