RC 15: దిల్ రాజుకు షాక్ ఇచ్చేలా శంకర్ మరో ఖరీదైన ప్లాన్.. పాట కోసం అన్ని కోట్లా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ప్రధాన కథానాయికగా కీయరా అద్వానీ నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్రలో అంజలి నటిస్తోంది. రామ్ చరణ్ ఇందులో డ్యుయేల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా శంకర్ స్టైల్ కు తగ్గట్టుగా మంచి సందేశంతో పాటు సామాజిక అంశాలను, కమర్షియల్ అంశాలను కూడా హైలెట్ చేయబోతున్నారు.
RC 15 సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నాడు. ఆయన కెరీర్ లోనే ఇదే అత్యధిక భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. మొదట 170 కోట్లతో నిర్మించాలని అనుకున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు 225 దాటినట్లుగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇంకా ఆ విషయంలో ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ రోజురోజుకు పెరిగిందని కూడా ఇండస్ట్రీలో మరొక టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా దర్శకుడు శంకర యాక్షన్స్ సన్నివేశాలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా భారీ స్థాయిలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అతని ప్రతి సినిమాలో ఒక సాంగ్ అయితే హై బడ్జెట్ తోనే ఉంటుంది. ఇక ఈసారి కూడా ఒక సాంగ్ కోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారట ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఎంతో కీలకమైన ఆ పాటలో అంజలి రామ్ చరణ్ మధ్యలో ఉండనుందట. అందులో రాంచరణ్, అంజలి స్టెప్పులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. భారీ స్థాయిలో డాన్సర్స్ తో అతిపెద్ద సెటప్ తో ఆ సాంగ్ షూట్ చేయబోతున్నారు. 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటే తప్పకుండా ఆ పాట సినిమాలో చాలా కీలకంగా కానున్నట్లు అర్థమవుతోంది. ఇక దాదాపు యాక్షన్స్ సన్నివేశాలు కోసం కూడా అదే తరహాలో ఖర్చు చేసినట్లు సమాచారం. మరి ఈ సినిమా ద్వారా దిల్ రాజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రాఫిట్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











