త్రివిక్రమ్ లో ఈ సరదా కూడా ఉందా.. మహేష్ బాబు సినిమా సెట్ లో ఆటలు.. ఫొటోలు వైరల్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాహ్య ప్రపంచంలో కనిపించేది చాలా తక్కువ. ఆయన సోషల్ మీడియాలో కూడా అసలే లేరు. కేవలం సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ లో మాత్రమే మీడియా ముందుకు వస్తారు. అది కూడా సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి రైటర్ అని అందరికీ తెలిసిన విషయమే. రైటర్ తర్వాత దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు.
ఇక అతను సెట్ లో ఉంటే చాలా వరకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతూ ఉంటారు. ఇక అందరితోనూ చాలా అన్యోన్యంగా ఉండే త్రివిక్రమ్ ఇతర ఆటపాటల్లో కూడా చాలా చలాకీగా పాల్గొంటారని చెబుతూ ఉంటారు. కానీ బయట ఎప్పుడూ కూడా ఆ తరహాలో త్రివిక్రమ్ కనిపించింది లేదు. ఇక ఇటీవల త్రివిక్రమ్ సినిమా సెట్ లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు.

సినిమా షూటింగ్ బ్రేక్ రావడంతో సరదాగా క్రికెట్ బ్యాట్ పట్టి ఆడుకుంటూ ఉన్నాడు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్రివిక్రమ్ క్రికెట్ ఆట అంటే కూడా చాలా ఇష్టం. ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో క్రికెట్ ఆటకు సంబంధించిన సన్నివేశాలు కూడా చూపించాడు.

ఇక రీసెంట్ గా ఇలా SSMB28 సినిమా సెట్ లో బ్యాట్ పట్టుకుని మిగతా యూనిట్ సభ్యులతో కూడా క్రికెట్ ఆడాడు. మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఇటీవల రెండవ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











