రూ. 1 కోటి ఇరవై లక్షలతో ‘డిస్కో రాజా’ కోసం భారీ సెట్...
మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డిస్కో రాజా'. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఎక్సర్స్‌లో రూ. 1.20 లక్షల ఖర్చుతో భారీ సెట్ వేశారు. ఈ సెట్లో రవితేజ, వెన్నెల కిషోర్, శశిర్ షరమ్, టోనిహొప్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్లో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో హైలెట్ అవుతాయని అంటున్నారు.

ఈ మూవీలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత నిర్మాత రామ్ తాళ్ళూరి... రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. హైదరాబాద్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఢిల్లీలో చిత్రీకరణ జరుగనుంది.
నిర్మాత రామ్ షూటింగ్ గురించి వెల్లడిస్తూ... ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఈ నెల 26తో ముగుస్తుంది. అగష్టు మెదటివారం నుండి ఢిల్లిలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్‌లో నభా నటేష్ జాయిన్ అవుతారు.
నటీనటులు
రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ తళ్లూరి
దర్శకుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థమన్
ఎడిటర్ : నవీన్ నూలి


Click it and Unblock the Notifications











