Don't Miss!
- News
మహానాడులో ఏడుపు తీర్మానాలు; నాలుకా తాటిమట్టా? ఉన్మాది చంద్రబాబు: ఏకిపారేసిన సాయిరెడ్డి
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
F3: ఓకే ఫ్రేమ్‌లో ముగ్గురు హీరోయిన్స్.. సెట్లో తమన్నా, మెహ్రీన్, సోనల్ గ్లామర్ రచ్చ!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న F3 సినిమా గురించే. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి మరింత విభిన్నమైన కామెడీతో నవ్వించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా నమ్మకంతో ఉన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ ఎప్పటిలానే F2 తరహాలోనే అల్టిమేట్ కామెడీతో సందడి చేయబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక దాదాపు మొదటి సినిమాలో నటించిన నటీనటులు ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సారి మరొక కొత్త హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ముగ్గురు హీరోయిన్స్ కు సంబంధించిన సన్నివేశాలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయట. ఇక వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫొటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో కామెడీ తో పాటు గ్లామర్ కూడా గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఇలాగే నవ్వుతూ అందంగా కనిపించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎఫ్ 3 సినిమా సెట్స్ లో ఇలా నవ్వుతూ కనిపించిన ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా ఒకవైపు ఒకవైపు గ్లామర్ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకుంటూనే మరొకవైపు వారి కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంటారు అని తెలుస్తోంది.
సోనాల్ చౌహాన్ పాత్ర ఈ సినిమాలో సెకండాఫ్లో డిఫరెంట్ లుక్ తో అద్భుతంగా ఉంటుంది అని సమాచారం. అంతే కాకుండా వీరు ముగ్గురు మధ్యలో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ కూడా అద్భుతంగా ఉంటుందట. సునీల్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. చూస్తుంటే ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ సినిమాలను చూసి ప్రేక్షకులు చాలా కాలమైంది. కాబట్టి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ సినిమాను మే 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరో పాటను కూడా విడుదల చేయబోతున్నారు.