Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డిస్కోరాజా కోసం Fast and Furious7 team.. హై యాక్షన్ సీన్ కోసం ఎన్ని కోట్ల ఖర్చంటే!
మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'డిస్కో రాజా'. రామ్ తాళ్ళూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో శర వేగంగా షూటింగ్ జరుగుతోంది.
బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే గోవాలో 15 రోజులు పాటు కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చిన చిత్ర బృందం ఫారిన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. యూరోప్‌లోని ఐస్‌ల్యాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించడానికి ప్లాన్ చేసినట్లు నిర్మాత తెలిపారు. ఈ షెడ్యూల్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నారు.
నాలుగు నిముషాల సన్నివేశం కోసం 4 నుంచి 5 కోట్ల రూపాయల ఖర్చు
ఐస్‌ల్యాండ్‌లో షూట్ చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారు. సెప్టెంబర్ 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్ దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. కేవలం 4 నిమిషాల సన్నివేశం కోసమే ఇంత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారట.
రంగంలోకి ‘ఫాస్ట్ & ఫురియెస్ 7' చిత్రానికి పని చేసిన టీం
ఐస్‌ల్యాండ్‌లో జరగనున్న ఈ షెడ్యూల్లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ & ఫ్యూరియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం రంగంలోకి దిగుతోంది. వీరి సమక్షంలో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయట.
గ్రాఫిక్స్ హంగులు
రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ కానున్నాయట.
అందరినీ నవ్వించబోతున్న వెన్నెల కిషోర్
ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీతో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం పంచుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.