దసరా రేస్‌లో గోపీచంద్.. శరవేగంగా 'చాణక్య' షూటింగ్

జయాపయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు హీరో గోపీచంద్. టాలీవుడ్‌లో మ్యాచో స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం 'చాణక్య' అనే కొత్త సినిమా చేస్తున్నారు. తమిళ దర్శకుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్ష‌న్ అండ్ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు సినిమాకు సంబంధించి మిగిలిన రెండు పాటలను ఇటలీలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఈ పాటల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. చిత్రానికి సంబంధించి మిగిలిన అన్ని పనులు పూర్తిచేసి ఈ దసరాకు 'చాణక్య' సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.

Gopichands Chanakya Movie will entartain on this Dassehra

ఈ చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడంలో అందె వేసిన చేయి తమిళ డైరెక్టర్ తిరుది. అతని స్టైల్ లోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ దసరాకు టాలీవుడ్ నుంచి ''సైరా నరసింహారెడ్డి, వెంకీ మామ'' లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటంతో, ఆ జాబితాలో గోపీచంద్ 'చాణక్య' సినిమా కూడా చేరడం విశేషం. దీంతో ఈ సారి బాక్సాఫీస్ వద్ద దసరా పోటీ రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X