twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ క్రిష్ పనిపై పవన్ కల్యాణ్ సీరియస్ లుక్.. ఏం జరిగిందంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాలలో హరిహర వీరమల్ల సినిమా కూడా టాప్ లిస్టులో ఉంది. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హిస్టారికల్ సినిమాలో నటిస్తూ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఇక రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్పాట్ లోని ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో క్రిష్ పనిపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

    మొదటిసారి అలాంటి పాత్రలో..

    మొదటిసారి అలాంటి పాత్రలో..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటి సారి డిఫరెంట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణ తెరకెక్కుస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ ఒక విభిన్నమైన వారియర్ గా కనిపించబోతున్నాడు. ఆ సినిమాను పవన్ కళ్యాణ్ ఒక రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

    అంచనాలు భారీ స్థాయిలో..

    అంచనాలు భారీ స్థాయిలో..

    పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ హైలెట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులకు ఒక సరికొత్త కిక్ ఇస్తుంది అనే చెప్పాలి. మొదటి సారి ఆయన హిస్టారికల్ నేపథ్యంలో ఉన్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.

    ఎలాంటి డూప్ లేకుండా..

    ఎలాంటి డూప్ లేకుండా..

    ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మరో కీలకమైన షెడ్యూల్ ను దర్శకుడు క్రిష్ మొదలుపెట్టాడు. ఇక ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల్లో కోసం హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని వర్క్ షాప్స్ నిర్వహించిన చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు డైరెక్ట్ గా షూటింగ్ స్పాట్ లో ఎలాంటి డూప్ లేకుండా పవన్ కళ్యాణ్ తో పలు యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

     మార్షల్ ఆర్ట్స్..

    మార్షల్ ఆర్ట్స్..

    పవన్ కళ్యాణ్ ఈ సినిమాకోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో కలిసి ముందుగా ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత షూటింగ్లో పాల్గొనడం విశేషం. రీసెంట్ గా చిత్రయూనిట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన టీజర్ ను కూడా విడుదల చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

    పవన్ సీరియస్ లుక్

    పవన్ సీరియస్ లుక్

    ఇక సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. షూటింగ్ లొకేషన్ లో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ ఫలితంపై చాలా సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. సీన్స్ ను డైరెక్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా మానిటర్ లో చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Hari hara veera mallu shooting spot Pawan kalyan serious look on krish work
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X