Mr Bachchan: గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ శంకర్.. రవితేజతో పాటు అతడే కారణం అంటూ!
టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న ఈ స్టార్ హీరో.. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఇలా ఇప్పుడు పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా 'ఈగల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
'ఈగల్' మూవీ విడుదల కాకముందే మాస్ మహారాజా రవితేన తన 74వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఇది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో ఇప్పుడా ప్రాజెక్టునే స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో చేస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా వస్తుంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఆ వెంటనే దర్శకుడు హరీశ్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్‌పై హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇందులో 'మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించిన మరో బ్యూటిఫుల్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. ఇది సాధ్యం అయ్యేందుకు సహకరించిన సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్‌కు ఒక్క థ్యాంక్స్‌తో సరిపెట్టుకోలేను' అని చెప్పాడు.

'మిస్టర్ బచ్చన్' షూట్‌పై హరీశ్ శంకర్ చేసిన ట్వీట్‌లో '24 గంటలూ షూట్‌లో పాల్గొంటూ ఇది సాధ్యం అయ్యేలా చేసిన మాస్ మహారాజా రవితేజ గారికి మిలియన్ థ్యాంక్స్' అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమాను ఎంతో వేగంగా చేస్తున్నట్లు హరీశ్ శంకర్ వెల్లడించాడు. దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికే విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. రవితేజ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











