War 2: వార్ 2 షూటింగ్ ఫిక్స్ లీక్.. ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్
War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర మూవీతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఎన్నోఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు.సరికొత్త రికార్డును సృష్టించాడు ఎన్టీఆర్. ఈ మూవీ సక్సెస్ తో బాలీవుడ్ లో అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తరువాత బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ ఫేమ్, క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే వార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే.. షూటింగ్ సంబంధించిన ఫిక్స్ లీక్ కావడంతో ఎన్టీఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్'మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కించనున్నది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2.. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నది. ఈ క్రేజీ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక దేవరను మూవీ విడుదల తరువాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విలే పార్లే స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని వేశారంట. ఈ సెట్ లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సెట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వార్ 2 సెట్స్ సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోల కూడా ఉన్నాయి. ప్రస్తుత్తం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ వైరల్ ఫోటోల్లో ఎన్టీఆర్ మాస్ లూక్ లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో ఈ ఫొటోస్ తీసినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో ..బ్రౌన్ కలర్ టీ షర్ట్, ఆ పైన ఆర్మీ షర్ట్ వేసుకొని. యాష్ కలర్ పాయింట్.స్టోర్స్ షూ వేసుకుని నడుస్తూ కనిపించాడు. ఈ యాంగ్రీ లో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాపై ఎన్టీఆర్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ మూవీ హిట్ అయితే.. బాలీవుడ్ ఎన్టీఆర్ పాగ వేయడం ఖాయమంటున్నారు.ఇక ఎన్టీఆర్ అప్ కామింగ్ చిత్రాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్నది. ఈ మూవీ ఎన్టీఆర్ 31 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది.


Click it and Unblock the Notifications











