మహర్షి సెట్‌లో హీరో కార్తీ.. మహేష్‌తో ముచ్చట్లు!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రంలో అంత్యత కీలకమైన ఫైట్స్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా పాల్గొంటున్నాడు.
తమిళ హీరో కార్తీ మహర్షి చిత్ర సెట్ ని సందర్శించారు. మహేష్ బాబు, దర్శకుడు వంశీపైడిపల్లితో సరదాగా ముచ్చటించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వంశి పైడిపల్లి దర్శత్వంలో కార్తీ ఊపిరి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. నాగార్జున, కార్తీ కలసి ఈ చిత్రంలో నటించారు.

కన్నడ స్టార్ హీరో శ్రీమురళి కూడా మహర్షి సెట్స్ కి వచ్చి మహేష్ ని కలిశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఫైట్ సీన్స్ షూటింగ్ ముగిస్తే చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చినట్లే. ఏప్రిల్ 25న మహర్షి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











