జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌పై దాడి: వాటిని టచ్ చేయడం వల్లే.. 20 మందికి గాయాలు

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోల రేంజ్ అమాంతం పెరుగుతూనే వెళ్తోంది. ఇలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. చాలా కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న అతడు.. RRRతో అంతర్జాతీయ స్థాయిని అందుకుని మరింత ఉత్సాహంతో వెళ్తున్నాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతుంది. కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

Honey Bees Attack On Jr NTR Starrer Devara Movie Team

'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తోన్నారు. అందులో మొదటి పార్టుకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా 'దేవర' సెట్స్‌లో ప్రమాదం జరిగింది.

ప్రస్తుతం 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద జరుగుతోంది. అక్కడ జూనియర్ ఆర్టిస్టులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ చెట్టుకు ఉన్న తేనె తట్టును షూటింగ్ అనుకోకుండా యూనిట్ టచ్ చేసింది. దీంతో తేనెటీగలు చిత్ర బృందంపై దాడి చేశాయి.

Honey Bees Attack On Jr NTR Starrer Devara Movie Team

ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ ఉన్న వాళ్లందరిపై దాడి చేయడంతో వాళ్లు ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఇలా మొత్తం 20 మంది వరకూ ఈ ఘటనలో గాయాల పాలయ్యారు. వాళ్లను స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. వాళ్లంతా ఇప్పుడు క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. కానీ, ఆ ఘటన వల్ల షూటింగ్‌ను నిలిపి వేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Honey Bees Attack On Jr NTR Starrer Devara Movie Team

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X