మంచుకొండల్లో బాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్ రొమాంటిక్ సీన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచు కొండల్లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ మూవీ 'సాహూ' లోని చివరి పాట కోసం చిత్రయూనిట్ అంతా కలిసి ఆస్ట్రియా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి అందమైన లొకేషన్స్ లో ప్రభాస్- శ్రద్ధ కపూర్ లపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.
ఈ మేరకు ఆస్ట్రియాలోని మంచు కొండల్లో వేగంగా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటలో ప్రభాస్, శ్రద్దల మధ్య రొమాన్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉండనున్నాయట. రొమాంటిక్ సాంగ్ లో నటిచాలంటే రొమాంటిక్ మూడ్ తెచ్చే లొకేషన్‌కి వెళ్లాలని డిసైడ్ అయిన చిత్రయూనిట్ చల్లని మంచు కొండల్లో ఆ పాట చిత్రీకరణ జరుపుతోంది. భారీ యాక్షన్స్ సీన్స్ నడుమ వచ్చే ఈ సాంగ్ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

బాహుబలి లాంటి భారీ రేంజ్ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్‌లో వస్తున్న సినిమా 'సాహో'నే కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఆ అంచనాలను మించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో చూడొచ్చని అంటోంది చిత్రయూనిట్. ఒళ్ళు గగ్గుర్లు పొడిచే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటికే అబుదాబిలో షూట్ చేయడం జరిగింది. చిత్రంలో ప్రభాస్ తో పాటు శ్రద్ధ కపూర్ యాక్షన్స్ ఎపిసోడ్స్ కూడా స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయి.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'సాహూ' మూవీ ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంది. విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.


Click it and Unblock the Notifications











