Priyanka Chopra ప్రియాంక చోప్రాపై దాడి... గ్లోబల్ స్టార్‌పై ఎటాక్‌ వెనుక కారణమేమిటంటే?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా తీవ్రమైన గాయాలతో కనిపించి అభిమానులను ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలలో ముఖం, చేతులపై తీవ్రమైన గాయాలతో ఎవ్వరూ ఊహించని విధంగా దారుణమైన పరిస్థితిలో కనిపించింది ఈ స్టార్ హీరోయిన్. మరి ఇంతకీ ప్రియాంక చోప్రాను అంత దారుణంగా కొట్టింది ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

హాలీవుడ్ హాట్ బాంబ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి సరసన ఆడి పాడి హాలీవుడ్ కు చెక్కేసిన విషయం తెలిసిందే. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడి అప్పట్లో విమర్శల పాలయింది ఈ అమ్మడు. అయితే తనపై వచ్చిన ట్రోలింగ్ ను పట్టించుకోకుండా ప్రియుడితో హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక చోప్రా.

Is Star Heroine Priyanka Chopra attacked Here is the reason behind the injuries

ప్రస్తుతం ఈ జంటకు మాల్టీ మేరీ ప్రియాంక జోనాస్ అనే పాప కూడా ఉంది. 2015 జనవరి 15న ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ సరోగసి ద్వారా ఈ పాపకు జన్మనిచ్చారు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది ప్రియాంక చోప్రా. మరోవైపు వరుస సినిమాలతో హాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ.

ఇప్పటికే బేవాచ్, ది మ్యాట్రిక్స్ రిసెరెక్షన్స్ వంటి సినిమాల్లో నటించి యాక్షన్ తో అదరగొట్టింది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను రిలీజ్ కాగా, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సితాడేల్ సీక్వెల్ తో పాటు ది బ్లఫ్ అనే మరో హాలీవుడ్ పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Is Star Heroine Priyanka Chopra attacked Here is the reason behind the injuries

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రియాంకా చోప్రా దారుణమైన గాయాల పాలైన ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో ప్రియంక గాయాలతో రక్తంలో తడిసి ముద్దయినట్టు, ముఖం వాచిపోయినట్టు, ముఖ్యంగా కంటికి తీవ్రమైన గాయమైనట్టు అనిపిస్తోంది. ఒక కంటిలో నుంచి నీళ్లు కారుతుండగా, ఆ కన్ను తీవ్రంగా కందిపోయి, ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తోంది.

ఊహించని ఈ ఫోటోలను చూసి ప్రియాంక చోప్రా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటిని ఇలా మొహం పగిలిపోయేట్టుగా కొట్టింది ఎవరంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఫోటోలన్నీ సినిమా షూటింగ్ కు సంబంధించినవి.

Is Star Heroine Priyanka Chopra attacked Here is the reason behind the injuries

తాజాగా ఆమె నటిస్తున్నఓ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతవరకు రిస్కీ స్టంట్స్ కారణంగా ఆమె గాయపడిన మాట వాస్తవమే. కానీ ఆ ఫొటోల్లో చాలా వరకు మేకప్ మ్యాజిక్ కన్పిస్తోంది. అంతేగానీ అందరూ అనుకున్నట్టుగా ప్రియాంక చోప్రాకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మొత్తానికి మేకప్ తో నిజమేమో అనిపించేలా గాయాలను క్రియేట్ చేసి ప్రియాంక చోప్రా అభిమానులను తెగ టెన్షన్ పెట్టేసారు. ఇక ఇప్పుడు అసలు విషయం తెలియడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రియాంక ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X