Devara: దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్.. గూస్‌బమ్స్ తెచ్చే లుక్‌లో యంగ్ టైగర్
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. 'టెంపర్' నుంచి వరుసగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. RRR సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'దేవర' అనే క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్ అయింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రమే 'దేవర'. ఈ సినిమా కోస్టల్ ఏరియా నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, అనివార్య కారణాలతో దీన్ని అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ సినిమా షూటింగ్‌తో పాటు మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేయాలని చూస్తున్నారు.
హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే చాలా భాగాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను గోవాలో జరుపుతున్నారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లపై సీన్స్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ సెట్స్ నుంచి వీడియో లీక్ అయింది.

గోవాలో జరుగుతున్న 'దేవర' మూవీ షూటింగ్ నుంచి తాజాగా ఓ వీడియో లీక్ అయింది. ఇందులో ఎన్టీఆర్ బ్లాక్ కలర్ షర్ట్, లుంగీతో గూస్‌బమ్స్ తెప్పించే లుక్‌తో కనిపించాడు. అంతేకాదు, అతడు వాటర్‌లో పవర్‌ఫుల్ వాక్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయింది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











