Bhagavanth Kesari: అనిల్ రావిపూడి గాలి తీసిన కాజల్, శ్రీలీల.. బాలయ్య కోసం క్రేజీగా!
'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటిసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను అస్సలు బ్రేకులు లేకుండా శరవేగంగా జరుపుకుంటూ వస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీ సెట్స్‌లో సందడి వాతావరణం ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో పలుమార్లు వెల్లడించాడు. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో అతడు చేసిన డ్యాన్స్ వీడియోను కూడా షేర్ చేశాడు.

ఇందులో బాలయ్య పాత పాట 'బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్యా'కు అదిరిపోయే స్టెప్పులు కూడా వేశాడు. దీంతో ఈ వీడియో అప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా దర్శకుడు అనిల్‌కు ఇందులో నటిస్తున్న హీరోయిన్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీళ్లిద్దరూ కలిసి నందమూరి బాలకృష్ణ నటించిన 'నరసింహానాయుడు' సినిమాలోని 'చిలకపచ్చ కోక' అంటూ సాగే పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. అంతేకాదు, గతంలో అనిల్ రావిపూడి డ్యాన్స్‌ను గుర్తు చేస్తూ.. వీళ్లిద్దరూ ఊరమాస్ స్టెప్పులతో రచ్చ లేపారు.
ఇదంతా ఎంతో ఫన్నీగా ఎడిట్ చేసి తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతేకాదు, 'భగవంత్ కేసరి సెట్స్‌లో కాజల్, శ్రీలీల బాలయ్య సాంగ్‌కు డ్యాన్స్ చేశారు' అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











