వైరల్‌గా సరిలేరు నీకెవ్వరు సెట్.. కళ్లు చెదిరేలా ఫిల్మ్‌సిటీలో కొండారెడ్డి బురుజు

భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రాజాది గ్రేట్, F2 వరుస సక్సెస్‌లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఫ్యాన్స్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కుతున్న చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో కళ్లు చెదిరే సెట్ వేశారు.

Konda Reddy Buruzu set of Sarileru Neekevvaru goes viral

కర్నూలు జిల్లాకే తలమానికంగా మారిన కొండారెడ్డి బురుజు సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఆ సెట్‌కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. నిజంగా కొండారెడ్డి బురుజా అనే ఫీలింగ్‌ను కలిగించేలా సెట్ ఉండటంతో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X