Don't Miss!
- Sports
Ee Sala Cup Namde Trolls: పాపం ఆ ఆంటీకి జన్మలో పెళ్లి కాదేమో.. ఆర్సీబీ ఓటమితో ఆంటీ మీద నెటిజన్ల సెటైర్లు..!
- News
హైదరాబాద్ గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్నిప్రమాదం; 14 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!!
- Lifestyle
మీరు మలవిసర్జన చేసినప్పుడు మీకు 'ఇలా' అనిపిస్తుందా? ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ సంకేతమని మీకు తెలుసా?
- Technology
ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ తగ్గింపు ఆఫర్లతో ప్రారంభమయ్యాయి!!
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Krish చేతుల మీదుగా రణస్థలి.. కేజీఎఫ్ రేంజ్‌లో డైలాగ్స్ అంటూ ప్రశంస
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు సమర్పణలో ధర్మ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర, విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం రణస్థలి ఫస్ట్‌లుక్ పోస్టర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రిలీజ్ చేయటం జరిగింది, హీరో నాగశౌర్య నటించిన "అశ్వథ్థామ"సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో రణస్థలి చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా రణస్థలి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ..
రణస్థలి సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే టైటిల్‌కు తగినట్టుగా ఉంది. సినిమా టీజర్ అద్భుతంగా కూడా చాలా బాగుంది. చిన్న సినిమాలో ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్ లెవెల్‌లో ఇంపాక్ట్ ఇస్తున్నాయి. టీం అంతా చాలా హార్డ్‌వర్క్ చేశారు. ఈ సినిమా టీం అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు.

దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రణస్థలి చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు క్రిష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు. మా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు చిన్న సినిమాపై వుండే చులకన భావం పోతుంది అని అన్నారు.
చిత్ర నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని అన్నారు
నటీనటులు:
ధర్మ,
ప్రశాంత్,
శివ
జామి,
నాగేంద్ర,
విజయ్
రాగం
తదితరులు
సమర్పణ
:
ధర్మ,
బసవ,
సురెడ్డి
విష్ణు
బ్యానర్
:
ఏ.జె
ప్రొడక్షన్స్
నిర్మాత
:
సురెడ్డి
విష్ణు
డైరెక్టర్
:
పరశురాం
శ్రీనివాస్
కెమెరామెన్
:
జాష్టి
బాలాజీ
ఎడిటర్
:
భువన్,