twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పాత్ర కోసం రోజుకు 14 గంటలు కుర్చీలోనే.. హీరో తిప్పలు చూడండి!

    |

    తమిళ హీరో మాధవన్ నటిస్తున్న తాజా చిత్రం 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్'. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నారు. మాధవనే ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. మాధవన్ ఈ చిత్రంలో టైటిల్ పోషిస్తున్నారు. నారాయణ్ లుక్ లోకి మారేందుకు మాధవన్ ఎంతగానో కృషి చేస్తున్నాడు. గడ్డం, హెయిర్ బాగా పెంచుతూ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో మాధవన్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

    ఈ చిత్రంలో మేకప్ కోసం రోజుకు 14 గంటలు కుర్చీలోనే కూర్చోవాల్సి వస్తోందని మాధవన్ తెలిపాడు. కనీసం కదలడానికి కూడా వీలు లేని విధంగా ఉన్న మేకప్ తో మాధవన్ కనిపించాడు. ఈ పాత్ర కోసం సిద్ధం కావడానికి రెండేళ్లు పట్టింది. మేకప్ తో రెడీ కావడానికి రోజులు 14 గంటలు పడుతోంది అని మాధవన్ తెలిపాడు. నంబి సర్ పాత్రలో నటించేందుకు చాలా ఆతృతగా ఉన్నా. ఆయన లుక్ లో నేను ఎలా ఉంటానో తెలియదు. కానీ ఆయనలా నటించేందుకు గట్టిగా ప్రయత్నిస్తా అని మాధవన్ తెలిపారు.

    Madhavan takes 14 hours to transform into scientist Nambi Narayanan

    కెరీర్ ఆరంభంలో లవర్ బాయ్ గా అదరగొట్టిన మాధవన్ ఇప్పుడు విభిన్నపాత్రలపై దృష్టి పెట్టాడు. విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా దర్శత్వం వహిస్తూ నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. త్వరలో షూటింగ్ ఫినిష్ చేసే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

    English summary
    Madhavan takes 14 hours to transform into scientist Nambi Narayanan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X