లుక్ ఇలా లేదే.....వైరల్ అవుతున్న మహేష్ బాబు ఫోటోస్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే షూటింగ్ స్పాట్ నుంచి మహేష్ బాబు ఫోటోస్ కొన్ని లీక్ అయినట్లు కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలిష్ లుక్‌తో ప్రక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఫోటోస్ కాస్త డిఫరెంటుగా ఉండటంతో ఇవి లేటెస్ట్ ఫోటోసా? లేక ఓల్డ్ ఫోటోసా? అనే విషయం అర్థం కావడం లేదు.

వైరల్ అవుతున్న ఫోటోస్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా సూపర్ స్టార్‌ను చూసేందుకు భారీ అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఆయన్ను సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది

బుల్లి అభిమాని చిరు దరహాసం
మహేష్ బాబును కలవడానికి వచ్చిన బుల్లి అభిమాని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చిరు దరహాసం చిందిస్తున్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు 25
‘మహర్షి' మూవీ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం. సూపర్ స్టార్ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తెలుగులో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

కీలక పాత్రల్లో..
ఈ చిత్రం ద్వారా మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే తొలిసారి నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











