ఫైట్‌కి దిగిన మహేష్ బాబు.. విజయశాంతి కూడా ఎంటర్.. యూనిట్ అంతా!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రానున్న సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. మహేష్ 25వ సినిమా మహర్షిని బీట్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నారు మేకర్స్.

కొండారెడ్డి బురుజులో ఫైట్
ఈ నేపథ్యంలో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజులో చేయాల్సిన కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యకంగా సెట్ వేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్‌లో మహేష్ బాబుతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా కొన్ని పోరాట ఘట్టాల షూటింగ్ మొదలెట్టేశారు.

రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో
శరవేగంగా అన్ని హంగులతో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేష్ బాబుతో పాటు కొంతమంది ఫైటర్లపై
ఈ పోరాట ఘట్టాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ ఫైట్ సీన్స్ చిత్రంలో హైలైట్ కానున్నాయని అంటున్నారు.

విజయశాంతి ఎంటర్
ఇక దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీ రెంటరీ ఇస్తున్న విజయశాంతి కూడా ఈ సెట్స్ పై అడుగుపెట్టిందని తెలుస్తోంది. చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆమెపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ నెల 12 వ తేదీ వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రంలోని మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











