రష్మికను వెంటపెట్టుకొని కేరళ వెళ్తున్న మహేష్.. ఎందుకో తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రీసెంట్‌గా 'మహర్షి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
దేశవిదేశాల్లోని అందమైన లొకేషన్స్, కాశ్మీర్ సరిహద్దులో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, రష్మిక మందన్న లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్ లోనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా పాల్గొనడం విశేషం.

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ ఇక కేరళ బయలు దేరిందట. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు అనిల్ రావిపూడి. చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరగనుంది. మహేష్ కెరీర్ లో 26 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షక లోకంలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా, విజయశాంతి 'భారతి' అనే కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈమె లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.


Click it and Unblock the Notifications











