Sarkaru Vaari Paata మహేశ్ ఫ్యాన్స్ వార్నింగ్.. దిగివచ్చిన యూనిట్.. మాస్ సాంగ్ అంటూ అప్‌డేట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌తో చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ #worstteamSVP అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సర్కారు వారీ పాట సినిమాకు సంబంధించిన మాస్ సాంగ్ గురించిన విశేషాలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చిత్ర యూనిట్ అందించిన వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తీ సురేష్, ఇతర డ్యాన్సర్లపై మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫిని అందిస్తున్నారు. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్‌లోనే మాస్ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాన్ని సమకూరుస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అంటూ చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్, రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

నటీనటుుల: మహేష్ బాబు, కీర్తీ సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
రచన, దర్శకత్వం: పరుశురాం
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట
సినిమాటోగ్రాఫర్: ఆర్ మాది
ఎడిటింగ్: మార్తాండే కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2022-05-12



Click it and Unblock the Notifications











