SSMB 29 షూటింగ్ షురూ.. ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు రీజినల్ ఫిల్మ్స్ లోనే నటించారు. ఇక ప్రస్తుతం ఏకంగా పాన్ వరల్డ్ సినిమా సినిమానే చేస్తుండటం వరల్డ్ ఆడియెన్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు కేవలం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29 ప్రాజెక్ట్స్ పైనే ఫోకస్ పెట్టారు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం పలు
షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇక మొన్నటి వరకు ఎండలు బాగా కొట్టడంతో జక్కన్న టీమ్ కు సమ్మర్ హాలీడేస్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వాతావరణం నార్మల్ గానే ఉండటంతో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కు ముహూర్తం, లోకేషన్ కూడా ఫిక్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తితే..
SSMB29 మూవీ వివరాలు..
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి SSMB29 చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ్ ఈ అడ్వెంచర్ ఫిల్మ్ ను రూ.1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే ఇదే హయ్యేస్ట్ బడ్జెట్ ఫిల్మ్ కావడం గమనార్హం. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అదే స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తుండటం విశేషం.

SSMB29 షూటింగ్ డిటైయిల్స్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ SSMB29 షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ ఓరిస్సా, కర్ణాటక, సౌత్ ఆఫ్రికా, ఇటలీ వంటి ప్రదేశాల్లోనూ పలు కీలక సీన్లను షూట్ చేశారు. ఈ చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి 3000 మంది ఆర్టిస్టులతో సీ బోట్ ఫైట్ కూడా షూట్ చేయబోతున్నట్టు తెలిసింది. ఒక మొన్నటి వరకు రెండు షెడ్యూళ్లు నిర్విరామంగా కొనసాగాయి. సమ్మర్ బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ ను తిరిగి జూన్ 7 నుంచి పునఃప్రారంభించబోతున్నారు. నటీనటులకు సంబంధించిన పాత షెడ్యూల్ లోని సీన్లను పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది.
రాజమౌళికి నో చెప్పిన బాలీవుడ్ స్టార్..
ఎస్ఎస్ రాజమౌళి సినిమాకు బాలీవుడ్ స్టార్ నటుడు నానా పాటేకర్ నో చెప్పారని తెలుస్తోంది. స్వయంగా జక్కన్ననే వెళ్లి నానా పాటేకర్ కు పుణెలో కథ వినిపించగా ఆయన ఒప్పుకోలేదంట. రూ.20 కోట్ల పారితోషికం కూడా ఇస్తామన్న చేయనని చెప్పారంట. అయితే అందుకు ఓ కారణం ఉందని తెలుస్తోంది. మహేశ్ బాబుకు తండ్రి పాత్రలో నటించేందుకు నానా పాటేకర్ ను సంప్రదించగా.. ఆ పాత్రకు తను ఫిట్ కాడని చెప్పారంట.
మహేశ్ బాబు నెక్ట్స్ మూవీస్..
మహేశ్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఎస్ఎస్ఎంబీ29 చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత మహేశ్ బాబుతో పని చేయడానికి సందీప్ రెడ్డి వంగ, బుచ్చి బాబు, నాగ్ అశ్విన్ వెయిటింగ్ లో ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











