సైరా యుద్ధం.. రోమాలు నిక్కబొడుచుకునేలా, స్టిల్స్ వైరల్, 35 రాత్రుల్లో!

Recommended Video

Syeraa Movie Stills Latest Pics Goes Viral సైరా యుద్ధం స్టిల్స్ లీక్

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 200 కోట్లు. అందుకు తగ్గట్లుగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశానికి సంభందించిన షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ముగించింది. ఈ చిత్ర కెమెరామాన్ రత్నవేలు ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనం ఇంతవరకు విన్నాం. ఆయన వీరత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి రూపంలో చూడబోతున్నాం. అతిరధ మహారధులు లాంటి నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.

రోమాలు నిక్కబొడుచుకునేలా

రోమాలు నిక్కబొడుచుకునేలా

తాజగా సోషల్ మీడియాలో సైరా చిత్రానికి సంబందించిన స్టిల్స్ వైరల్ గా మారాయి. నైట్ ఎఫెక్ట్ లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు సంబందించిన ఈ స్టిల్స్ రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉన్నాయి. గుర్రాల, భారీ సెట్ వర్క్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

35 రాత్రుల్లో

35 రాత్రుల్లో

ఈ యుద్ధ సన్నివేశాల్ని 35 రాత్రుల్లో తెరకెక్కించామని ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. వర్షం ఇబ్బంది పెట్టినా విజయవంతంగా చిత్రీకరణ జరిపాం. బ్రిటిష్ ఆర్మీ, ఫిరంగుల, గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాం. ఏ చిత్రీకరణ మొత్తం అతి తక్కువ కాంతిలో జరిగినట్లు తెలిపారు.

బ్రిటిష్ వారిపై దండెత్తే సన్నివేశం

బ్రిటిష్ వారిపై దండెత్తే సన్నివేశం

సైరా నరసింహారెడ్డి తన బలగంతో బ్రిటిష్ వారిపై దండెత్తే నేపథ్యంలో ఈ యుద్ధం జరుగుతుంది. చిత్రంలో ఈ సన్నివేశం అత్యంత కీలకమైనదిగా చెబుతున్నారు.

 భారీ తారాగణం

భారీ తారాగణం

ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్. జగపతి బాబు, తమన్నా వంటి నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X