Acharya షూటింగ్ లో నాకు జరిగిన అన్యాయం.. చరణ్ మర్యాదగా ఉండదని అన్నాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ప్రస్తుతం సోషల్ మీడియా బజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ వలన తనకు జరిగిన అన్యాయం గురించి తెలియజేశాడు.

అభిమానులు కోరుకునే..
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో కథాంశం ఎంత కొత్తగా ఉన్నా కూడా అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు కూడా అదే తరహాలో ఉంటాయి. ఆచార్య సినిమాలు కూడా మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయట.

ధర్మకోసం..
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా నక్సలైట్స్ పాత్రలో కనిపించబోతున్నారు. ధర్మస్థలి అనే ఒక దేవాలయ ప్రాంతంలో ఈ సినిమా కథ కొనసాగుతుంది. ధర్మం కోసం పోరాడే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనే అంశం ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందని దర్శకుడు తెలియజేశాడు

షూటింగ్ కోసం...
ఇక ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తేజ్ తో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం దొరికిందట. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే తాము ఇద్దరం చాలా కాలం తర్వాత సినిమా షూటింగ్ కోసం ఓకే ప్రాంతంలో దాదాపు 20 రోజులపాటు ఉండాల్సి వచ్చింది అని చెప్పారు.

అన్యాయం జరిగింది
మారేడుపల్లిలో షూటింగ్ జరిగినప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన రూమ్ లో ఇద్దరం కూడా 20 రోజులపాటు ఉన్నామని అయితే అప్పుడు తనకు అన్యాయం జరిగిందని చిరంజీవి సరదాగా చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ తేజ తనతో ప్రత్యేకంగా ఒక సహ నటుడిగా ట్రావెల్ అవ్వాలి అని ప్రతి రోజు తనకు దగ్గరగా ఉన్నట్లు తెలియజేశారు.

మరియాదగా ఉండదని..
ప్రతిరోజు ఇంట్లో ఒక తండ్రి కొడుకులుగా ఉంటాం కానీ ఇప్పుడు ఒక సహ నటుడు గా మీతో నాకు కొనసాగాలని ఉంది అని రామ్ చరణ్ నాతో చెప్పాడు. అంతేకాకుండా నా భార్యను కూడా నా దగ్గరకు రానివ్వకుండా చేశాడు. షూటింగ్ కి రావద్దు అని తన తల్లికి చెప్పాడని వస్తే మర్యాదగా ఉండదు అని కూడా అన్నట్లు మెగాస్టార్ చిరంజీవి కొడుకు అల్లరి గురించి వివరణ ఇచ్చాడు. ఏదేమైనా ఆ షూటింగ్ జరిగిన ఈ రోజుల్లో ప్రతి రోజూ ఉదయం ఇద్దరం కూడా కలిసి వర్కౌట్స్ చేస్తూ కలిసి భోజనం చేస్తూ కలిసి షూటింగ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











