Allu Arjun Pushpa 2: పుష్ప 2 సినిమాలో మెగాస్టార్ చిరంజీవి... షూటింగ్ నుంచి ఫోటోస్ లీక్!
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్... క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సుకుమార్. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఉండబోతున్నట్లు నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాదు.. షూటింగ్ నుంచి పోటోస్ లీక్ అయ్యాయి. అవి నెట్టింట వైరల్ గా మారాయి. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే....
2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప... ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా మారిపోయారు. ఇక రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఎక్కడ చూసిన పుష్ప పాటలే వినిపించాయి. ఇక పుష్ప మేనరిజం కూడా క్రికెట్ స్టార్స్ నుంచి పొలిటికల్ స్టార్స్ వరకు అందరూ వాడేశారు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సుకూమార్. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక పుష్ప 2లో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా... సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు.. ఎక్సైటింగ్ స్టారింగ్ ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక పుష్ప సినిమా నుంచి విడుదలైన వేర్ ఇజ్ పుష్ప గ్లింప్స్ అయితే విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతే కాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా నెట్టింట ట్రెండ్ సెట్టింగ్ అయ్యాయి. పుష్ప రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పుష్ప నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్టేట్ బయటకు వచ్చింది. అదేంటి అనుకంటున్నారా... పుష్ప 2 సినిమాలో చిరంజీవి ఉండబోతున్నారట.

వామ్మో పుష్ప సినిమాలో చిరంజీవి అంటే ఫ్యాన్స్ కు డబుల్ కిక్. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్.. చిరంజీవి ఫ్యాన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పుష్ప 2 సినిమా 2000 సంవత్సరం టైంలో జరిగిన కథగా చూపిస్తున్నారు. అయితే తాజాగా లీక్ అయిన ఫొటోల్లో పుష్పరాజ్ చిరంజీవి ఫ్యాన్ అని.... ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ దగ్గర పుష్పరాజ్ యువసేన అని బ్యానర్లు పెట్టినట్టు నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి బ్యానర్లు పెట్టి పుష్పరాజ్ హంగామా చేసినట్టు అందులో తెలుస్తోంది.
దీంతో పుష్ప 2 సినిమాలో చిరంజీవి ఇంద్ర రిఫరెన్స్ వాడుతున్నట్టు అర్థం అవుతుంది. దీంతో సుక్కు ప్లాన్ మామూలుగా లేదని అంటున్నారు. ఇంద్ర సినిమా సమయంలో థియేటర్స్ వద్ద హంగామా, థియేటర్లో చేసే హడావిడి సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. దీంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పుష్ప సినిమాకు ఇంద్ర రిఫరెన్స్ కలిసి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











