గుబురు గడ్డం.. అరవీర భయంకరంగా మెగాస్టార్ చిరు.. వైరల్ అవుతున్న పిక్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా రు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన భారీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతోంది. యుద్ధ సన్నివేశాల్ని దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ నుంచి బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గుబురు గడ్డం
తాజా లుక్ లో చిరంజీవి మరింత గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో చిరంజీవి నటించడం ఇదే తొలిసారి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

మరచిపోలేని క్షణాలు
మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగిన ఫోటోలని చరణ్ దీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా జీవితంలో ఈ క్షణాలని మరచిపోలేనని తెలిపాడు. సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్
సైరా నరసింహారెడ్డి చిత్రంలా యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నాయి. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పర్యవేక్షణలో సైరా యాక్షన్ సీన్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారితో సైరా నరసింహారెడ్డి పోరాడే సన్నివేశాలు అబ్బురపరిచే విధంగా ఉండనున్నాయి.

వేసవి కానుకగా
సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తయిన తరువాత చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











