కొడుకుని చూడకుండా ఉండలేకపోయిన చిరు.. యుద్ధం మధ్యలో, పక్కదేశమే కదా అని!
Recommended Video

అనుకోకుండా జరిగినా కొన్ని సంఘటనలు చాలా మధురంగా అనిపిస్తాయి. అలంటి సంఘటననే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ విషయంలో జరిగింది. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్బైజాన్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. రంగస్థలం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అనుకోకుండా
రాంచరణ్, బోయపాటి చిత్రం అజార్బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు చిత్రం ఇదే. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్ర సైరా నరసింహారెడ్డి షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ రెండు యూరప్ దేశాలు ఉండేది పక్క పక్కనే. ఇలా తండ్రి కొడుకుల చిత్రాలు అనుకోకుండా ఇరుగు పొరుగు దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.

రాంచరణ్‌ని చూడకుండా
రాంచరణ్, చిరంజీవి మధ్య అంతులేని మమతానురాగాలు ఉన్నాయి. కొడుకు పక్క దేశంలోనే ఉంటే చిరు చూడకుండా ఉండలేకపోయాడేమో. అందుకే జార్జియా నుంచి అజర్బైజాన్ లోని రాంచరణ్ సినిమా సెట్స్ లో వాలిపోయాడు. రాంచరణ్ తో ఉన్న ఫోటోలు బయటకు రాలేదు కానీ నిర్మాత దానయ్యతో చిరు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యుద్ధ సన్నివేశాలు
ప్రస్తుతం జార్జియాలో సైరా నరసింహ రెడ్డి యుద్ధ సన్నివేశల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మరీ రాంచరణ్ ని చూడడానికి మెగాస్టార్ వెళ్ళాడు. మరో కొన్ని రోజుల్లో రాంచరణ్, బోయపాటి టీం ఇండియాకు తిరిగిరానుంది. సైరా షూటింగ్ మాత్రం నెలరోజుల పాటు జార్జియాలో జరుగుతుంది.

రాంచరణ్ సంక్రాంతికి, చిరు వేసవికి
రాంచరణ్ బోయపాటి చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. సైరా చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











