ఆచార్య చిరంజీవితో సన్నాఫ్ ఇండియా మోహన్‌బాబు.. బిగ్‌బాస్‌ను కలిశా అంటూ మంచు విష్ణు ట్వీట్
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మధ్య విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకొన్నప్పటికీ వారి మధ్య చమక్కులు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా వారిద్దరి కలయిక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
లాక్‌డౌన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. షూటింగులో ఉన్న చిరంజీవికి బుధవారం మోహన్‌బాబు సర్పైజ్ విజిట్ చేసి షాకిచ్చారు. ఆచార్య సెట్లో మెగాస్టార్‌ను కలిసి ఆత్మీయంగా పలకరించుకొన్నారు. పుష్పగుచ్ఛాన్ని అందించి తన అభిమానాన్ని చాటుకొన్నారు. వారిద్దరూ కాసేపు ప్రేమగా పలకరించుకోవడం యూనిట్ సభ్యులను ఆకట్టుకొన్నది.

ఇక బుధవారం రోజున మంచు వారసుడు విష్ణు కూడా చిరంజీవిని కలుసుకోవడం విశేషం. తాను ఎందుకు కలుసుకొన్నానో త్వరలోనే వెల్లడిస్తానని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై మంచు విష్ణు ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ ఎందుకు అయ్యాడనే విషయం ఇతరులపై ఆయన ప్రేమానురాగాలే చెబుతాయి అని విష్ణు పేర్కొన్నారు.
ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. సూర్యతో ఆకాశం నీ హద్దురా అనే చిత్రంలో చక్కటి పాత్రతో ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా అనే వినూత్నమైన చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Click it and Unblock the Notifications











