Mokshagna: భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. లీకైన షూట్ ఫొటోలు
ఈ మధ్య కాలంలో వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి సూపర్ డూపర్ హిట్లను అందుకుని ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన మరిన్ని ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రమే 'భగవంత్ కేసరి'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి షూట్ జరుపుతూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.

తెలంగాణ నేపథ్యంతో సాగే కథతో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. దీన్ని హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. దీన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ సెట్స్‌లో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ప్రత్యక్షమై సర్‌ప్రైజ్ చేసేశాడు.
'భగవంత్ కేసరి' మూవీ షూటింగ్ స్పాట్‌లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు. పాట చిత్రీకరణ జరుగుతుండగా బ్రేక్ రావడంతో అతడు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాత అందరితో కాసేపు సరదాగా మాట్లాడాడు. ఇక, షూట్‌లో కనిపించిన మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

'భగవంత్ కేసరి' మూవీ సెట్స్‌లో మోక్షజ్ఞ కనిపించడంతో ఈ సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడా అన్న అనుమానాలను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా లీకైన ఫొటోలో అనిల్ రావిపూడి అతడికి సీన్ వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది హైలైట్ చేస్తున్న కొందరు మోక్షజ్ఞ.. బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్‌ను చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











