Naga Chaitanya: ఆ హీరోయిన్‌తో పరుగులు పెడుతున్న నాగచైతన్య... వీడియో లీక్!

అక్కినేని వారసుడు నాగచైతన్య ఓ హీరోయిన్ తో కలిసి నడిరోడ్డుపై పరుగులుపెట్టాడు. చేతిలో చేయి వేసి మరీ... పరుగులు తీశాడు. ఇక ఆ వీడియోను మొత్తం ఓ వ్యక్తి తన సెల్ ఫోనులో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో వదిలాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నాగచైతన్యతో పరుగులుపెడుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సాయి పల్లవి.. మరి సాయి పల్లవితో నాగచైతన్య ఎందుకు పరుగులు పెట్టాడో ఈ స్టోరీలో చూద్దాం.

అక్కినేని వారసుడు నాగచైతన్యకు సిల్వర్ స్క్రీన్ మీద సరైన హిట్ పడక చాలా కాలమే అయింది. ఆయన నటించిన చివరి చిత్రం కస్టడీ. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే నాగచైతన్య ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన దూత వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ములేపుతుంది. మొదటి సిరీస్ తోనే నాగచైతన్య సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు.

NagaChaitanya Sai Pallavi Running Video Leak on Thandel Movie Sets Full Details Here

ఇక నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో చందుమొండేటి తండేల్ ఒకటి. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నాగచైతన్య మత్య్స కారుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. తండేల్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తనకు కలిసి వచ్చిన హీరోయిన్ సాయి పల్లవి ఇందులో ఆయన సరసన నటిస్తుండగా... వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. మొదటి చిత్రం లవ్ స్టోరీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే.. తాజాగా నాగచైతన్య.. సాయి పల్లవితో కలిసి పరుగులు పెడుతున్నాడు. ఆ వీడియో షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో షూటింగ్ స్పాట్ నుంచి ఎవరో లీక్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. ఫ్యాన్స్.. మరో హిట్ ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. తండేల్ చిత్రంపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య. ఇక ఈ తండేల్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది తండేల్ అర్ధం కోసం వెతికారు. అయితే తండేల్ అంటే.. నాయకుడని, సాహాస వీరుడు అని, రకరకాలుగా అర్ధాలు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో కూడా చందు మొండేటి తండేల్ అంటే ఏంటో చెప్పుకువచ్చాడు.

NagaChaitanya Sai Pallavi Running Video Leak on Thandel Movie Sets Full Details Here

తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం ఉండగా.. గుజరాత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని వాడుతారని చెప్పుకువచ్చారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య.. గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారని ఆయన బయటపెట్టారు. ఈ సినిమాను అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. జాలర్ల జీవితాల బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X