పోర్చుగల్ వదిలి హైదరాబాద్ వచ్చేసిన నాగ్.. చివరకు అలా డిసైడ్ అయ్యారట
కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మన్మథుడు 2. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు టాలీవుడ్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మనం ఎంటర్ టైన్ మెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున కొడుకు నాగచైతన్య, కోడలు సమంత కూడా చిత్రంలో కనిపించనున్నారు. ఇక కీర్తి సురేష్ ఓ కీలక పాత్ర పోషిస్తోందని లేటెస్ట్ సమాచారం. సీనియర్ నటి లక్ష్మి చాలా కాలం తరవాత ఈ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనున్నారు. ఝాన్సీ, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మన్మథుడు 2 తాజాగా పోర్చుగల్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు యూనిట్ సభ్యులు. గత నెల రోజులుగా నాగార్జున అండ్ టీమ్ పోర్చుగల్ లోని పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోర్చుగల్ షెడ్యూల్ ఫినిష్ చేసి విమానాశ్రయానికి చేరుకున్న నాగ్.. అక్కడ ఓ పిక్ దిగి మరోసారి పోర్చుగల్ లో షూటింగ్ చేసుకోవాలనుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి మన్మథుడు 2 చిత్రాన్ని ఆగస్టు నెలలోనే ప్రేక్షకుల ముందుంచాలని ఫిక్స్ అయ్యారు నాగార్జున. కానీ అదే నెలలో మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'సైరా నరసింహా రెడ్డి' విడుదల కానుండటంతో.. తన సినిమాను దసరాకు రావాలని భావించారట. తీరా చూస్తే దసరాకు ప్రభాస్ బిగ్గెస్ట్ మూవీ 'సాహో' వస్తుండటం, బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కూడా అదే సీజన్ లో విడుదల కానుండటంతో దసరా రేస్‌లో ఉండటం మంచిది కాదని నాగ్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు తన చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందుగానే అంటే జులై నెలలోనే విడుదల చేయాలని నాగ్ ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











