హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాలయ్య భామ.. నిండుగా బట్టలు కప్పుకొని! వైరల్ పిక్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వేదిక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనడానికి ఆమె హైదరాబాద్ విమానం ఎక్కింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈమె నిండు బట్టలు వేసుకోవడం విశేషం. నేటితరం హీరోయిన్ అయి ఉండి కూడా ఇలా ఫుల్లుగా తన అందాలను కప్పేసుకోవడంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ కెరీర్‌లో 105 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారట యూనిట్ సభ్యులు. ఇక రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారట. ఈ షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరగనుందని సమాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ లుక్‌లో బాలయ్యబాబును చూసి షాకయ్యారు ప్రేక్షకులు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి 'రూలర్' టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నాడని సమాచారం.
గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైసింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య 105ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











