NBK109: బాలయ్య బాబీ సినిమా నుంచి లుక్ లీక్... యంగ్ కుర్రాడిలా భలే ఉన్నాడే!
నందమూరి నటసింహం బాలయ్య.. గత ఏడాది రెండు హిట్లను అందుకున్నారు. ఇక ఈ ఏడాది బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి నందమూరి నటసింహం బాలయ్య లుక్ లీక్ అయింది. ఇక అందులో బాలయ్య యంగ్ కుర్రాడిలో కనిపిస్తున్నాడు. అసలు ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుపుకుంటుంది.. బాలయ్య లుక్ ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నందమూరి బాలయ్య వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అఖండ, వీరసింహరెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరుస హిట్లతో జోష్ మీద ఉన్న నందమూరి నటసింహం మళ్లీ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

బాబీ గత ఏడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్టను అందుకున్నాడు. ఇప్పుడు బాలయ్యతో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు బాబీ ఈ సినిమాను సైలెంటుగా తెరకెక్కించేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం కూడా బయటకు రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు మేకర్స్. త్వరగా సినిమాని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.
బాలయ్య గానీ... దర్శకుడుగానీ.. చిత్ర యూనిట్ కానీ... ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండానే.. సైలెంటుగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. NBK109 సినిమాను సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలను మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.
మొదట ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ అంతకంటే ముందే షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో విడుదల ముందుగానే చేయాలనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలోనే NBK109 సినిమాను వేసవిలో అనగా మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అందులో త్రిష, ప్రియమణి, ఊర్వతి రౌతేలా.. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందట.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి బాలయ్య లుక్ రిలీజ్ అయింది. తాజాగా షూటింగ్ సెట్ నుంచి బాలయ్య లుక్ బయటకు లీక్ అయింది. ఇందులో యంగ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. అంతేకాదు స్టయిలీష్ లుక్ లో.. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. స్టయిలీష్ గ్లాస్ షర్ట్ కి పెట్టి... తలపై క్యాప్ తో దర్శనం ఇచ్చాడు. ఇక ఈ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రిలోని మారేడిమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.


Click it and Unblock the Notifications











