20 రోజులుగా అక్కడే బాలకృష్ణ.. మొత్తానికి ఫినిష్ చేసేశారు
నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన ఈ వెటరన్ హీరో ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. ఈ తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు క్రియాశీలంగా పాల్గొనడం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ కొత్త సినిమా తొలి షెడ్యూల్ థాయిలాండ్ లో జరిగింది. 20 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. చిత్రంలోని 2 పాటలు, యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. అయితే తాజాగా థాయిలాండ్ పూర్తయిన్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. హీరో బాలకృష్ణ, హీరోయిన్స్ వేదిక, సోనాల్ చౌహన్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. తదుపరి షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.

బాలయ్య బాబు కెరీర్ లో 105 వ సినిమాగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, సాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు, ధన్ రాజ్, బండ రఘు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











