వెంకటేష్ డెన్‌లోకి బాలయ్య.. అనిల్ రావిపూడి అలా ప్లాన్ చేశాడా!
తెలుగు సినిమా రంగంలో కొంత మంది సీనియర్ హీరోలు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఫ్యామిలీ హీరోగా సత్తా చాటిన ఆయన ఈ స్టార్ హీరో.. ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. ఇలా చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ ఈ ఏడాది 'సైంధవ్' అనే సినిమాను చేశారు.
విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా సరైన విజయాన్ని అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ కావడంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమాకు ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ను సైతం శరవేగంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును సైతం పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ నటసింహా నందమూరి బాలకృష్ణ కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్‌లో నందమూరి బాలకృష్ణ చాలా సేపు సందడి చేశారు. దీంతో ఇందులో బాలయ్య ఏమైనా కామియో రోల్ చేస్తున్నారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి చాలా రోజుల క్రితమే ఈ న్యూస్ వైరల్ అయింది. బాలయ్యతో ఉన్న చనువుతో అనిల్ రావిపూడి ఆయనను ఒప్పించాడని అన్నారు. ఇప్పుడు ఆయన సెట్స్‌లో కనిపించడం ఈ పుకార్లకు బలం చేకూర్చింది.
ఇదిలా ఉండగా.. దగ్గుబాటి వెంకటేష్ - అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











