అందంతో అదరగొట్టిన నయనతార... 14 ఏళ్ల తర్వాత మళ్లీ.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ ముంబైలో నిర్విరామంగా జరుగుతున్నది. లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రజనీ సరసన అందాల తార నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి నయనతార ముంబైలో జరుగుతున్న షూటింగ్ కోసం చిత్ర యూనిట్‌తో చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే...

14 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో

14 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో

సుమారు 14 ఏళ్ల తర్వాత నయనతార దర్బార్ చిత్రంలో రజనీకాంత్ సరసన నటిస్తన్నది. గతంలో చంద్రముఖి, కుచేలన్, శివాజీ సినిమాల్లో రజనీతో నటించి మెప్పించింది. చంద్రముఖి చిత్రంలో నయనతార, రజనీ మద్య క్రెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా రజనీకాంత్ జతకట్టిన నయన మంగళవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నది.

షూటింగ్‌లో నయన ఫొటోతో

షూటింగ్‌లో నయన ఫొటోతో

నయనతార దర్బార్ షూటింగ్‌కు హాజరైంది. దర్బార్ సెట్స్‌లో తలైవాతో కలిసి సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. అంటూ నయన తార గెటప్‌కు సంబంధించిన స్టిల్‌ను ట్విట్టర్‌లో లైకా ప్రొడక్షన్, ఏఆర్ మురగదాస్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన దర్బార్‌ చిత్రంలో నయనతార స్టిల్ హోమ్లీగా తెగ ఆకట్టుకొంటున్నది.

ఏఆర్ మురగదాస్ రియాక్షన్

ఏఆర్ మురగదాస్ రియాక్షన్

నయనతారతో పనిచేయడంపై దర్శకుడు ఏఆర్ మురగదాస్ స్పందించారు. నయనతారతో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నాను. ముంబైలో కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ నడుస్తున్నది. మంగళవారం ఆమె యూనిట్‌తో భాగమైంది అని మురగదాస్ పేర్కొన్నారు. కాగా ముంబైలో షూటింగ్ సందర్భంగా లీకైన నయనతార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముంబైలో ప్రత్యేకంగా సెట్

ముంబైలో ప్రత్యేకంగా సెట్

దర్భార్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఏఆర్ మురగదాస్ ప్రత్యేకంగా సెట్‌ను వేశారు. కథలో భాగంగా ముంబైలో జరిగే సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. దర్భార్ చిత్రంలో రజనీకాంత్‌తోపాటు నయనతార, యోగిబాబు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తదితరుల నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో 167వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X