గట్టిగా కౌగలించుకుని, నయనతార బుగ్గలు నలిపేస్తూ.. వైరల్ అవుతున్న వీడియో!

Recommended Video

Nayanthara Playing With Kid Azerbaijan Ts Too Cute

నయనతార ప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్. నయనతారతో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా స్టార్ హీరోల సినిమా రేంజ్ లో రాణిస్తున్నాయి. దీనితో నయనతారకు సౌత్ లో అమాంతం డిమాండ్ పెరిగిపోతుంది. ఇటీవల నయనతార ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక పారితోషం అందుకుంటున్న సౌత్ నటిగా అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో నయనతార చేతినిండా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం నయనతార స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

 అజార్బైజాన్‌లో షూటింగ్

అజార్బైజాన్‌లో షూటింగ్

శివ కార్తికేయన్, నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ రాజేష్ దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజార్బైజాన్ లో కీలక సన్నివేశాలు చిత్రికరిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో నయనతార, శివ కార్తికేయన్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వీడియో బయటకు వచ్చి నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది.

బుగ్గలు నలిపేస్తూ

షూటింగ్ లొకేషన్ లో నయనతార ఓ పాపతో ఆడుకుంటున్న వీడియో చాలా క్యూట్ గా ఉంది. ముద్దొచ్చేలా ఉన్న ఈ పాపలో అల్లరి చేష్టలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార ఏమి చేసినా దానికి రెండింతలు చేస్తోంది. వయ్యారంగా కెమెరాకు ఫోజు ఇస్తోంది. ముద్దొస్తున్న ఆ పాప బుగ్గలు నయనతార గిల్లాగా.. వెంటనే ఈ అల్లరి పిల్ల కూడా నయన్ బుగ్గలని నలిపేస్తోంది. నయన్ మీద పది గట్టిగా కౌగిలించుకుంటోంది. ఈ దృశ్యం మొత్తం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది.

క్రేజీ చిత్రాలు

క్రేజీ చిత్రాలు

నయనతార ప్రస్తుతం నటిస్తోంది అలాంటి ఇలాంటి చిత్రాల్లో కాదు. మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి, అజిత్ సరసన విశ్వాసంచిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు విజయ్, అట్లీ కాంబోలో హ్యాట్రిక్ తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంలో కూడా నయన్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గ్లామర్, లేడీ ఓరియేంటేడ్, ఎమోషనల్ అది ఎలాంటి చిత్రం అయినా, పాత్ర అయినా నయన్ ఒదిగిపోయి నటిస్తుండడంతో ఆమెకు ఇంత క్రేజ్ నెలకొని ఉంది.

ప్రియుడితో రొమాన్స్

ప్రియుడితో రొమాన్స్

నయనతార ఎప్పటికప్పుడు వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం నయన్ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాటు ప్రేమలో మునిగితేలుస్తోంది. త్వరలో ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నా..నయన్ వైపు నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X