మొత్తానికి ఫినిష్ చేశారు.. ఇక ఆ పనులు మొదలెట్టిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ బయటకొచ్చింది. బాలకృష్ణ కెరీర్‌లో 105 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారట యూనిట్ సభ్యులు.

బ్యాంకాక్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ పూర్తిచేసిన చిత్ర యూనిట్ ఇక ఆ షెడ్యూల్ తాలూకు డబ్బింగ్ ఫినిష్ చేసే పనిలో ఉందట. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన భాగానికి గాను బాలకృష్ణ తన డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారట. త్వరలోనే ఈ కార్యక్రమం ముగించి తదుపరి షెడ్యూల్ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

 NBK105 movie update: Dubbing works started

ఈ సినిమాలో బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ లుక్ లో బాలయ్యబాబును చూసి షాకయ్యారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి 'రూలర్' టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నాడని సమాచారం.

గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైసింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య 105ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X