NBK107: ముద్దులు పెడుతూ బాలయ్యతో శృతిహాసన్ సెల్ఫీ.. జోష్‌లో నందమూరి ఫ్యాన్స్

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీలో ఆయనకు ఆయనే సాటి. ఎవరికైనా ఎలివేషన్స్​ ఇస్తే కాస్త అతిగా కనిపిస్తుంది. కానీ, బాలయ్య బాబుకు ఎలివేషన్​ ఇవ్వకుంటేనే లోటుగా అనిపిస్తుంది. అంతెందుకు బాలకృష్ణ చెప్పే డైలాగ్​లకు సెపరేట్ ఫ్యాన్​ బేస్​ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవల అఖండతో భారీ హిట్​ కొట్టిన బాలయ్య బాబు మాస్​ దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్​లో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్​కు సంబంధించిన తాజా పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్​గా మారింది.

మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​..

మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​..

అఖండతో పవర్​ ఫుల్​ హిట్​ కొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. క్రాక్​ మూవీతో ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు మాస్​ డైరెక్టర్​ గోపిచంద్ మలినేని. ఇక వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా అంటే రచ్చ రచ్చే అంటున్నారు బాలయ్య అభిమానులు. బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్ NBK107.

ఇస్తాంబుల్​లో..

ఇస్తాంబుల్​లో..

ఈ మూవీ షూటింగ్​ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను టర్కీలోని ఇస్తాంబుల్​ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్​లో ప్రముఖ తారాగణమంతా పాల్గొననుందని సమాచారం. కాగా ఈ మూవీలో టాలెంటెడ్​ హీరోయిన్​ శ్రుతి హాసన్​ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ముద్దులతో సెల్ఫీ..

ముద్దులతో సెల్ఫీ..

ప్రస్తుతం బాలకృష్ణ, శ్రుతిహాసన్​పై వచ్చే సాంగ్స్​ను ఇస్తాంబుల్​లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పిక్​ను సోషల్ మీడియాలో వదిలాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఇందులో శ్రుతిహాసన్ ముద్దులు పెడుతూ పోజివ్వగా, బాలకృష్ణ స్టైలిష్​గా కనిపించారు. దీన్ని సెల్ఫీ ద్వారా క్లిక్​మనిపించాడు డైరెక్టర్ గోపిచంద్​.

వైరల్​గా మారిన సెల్ఫీ..

వైరల్​గా మారిన సెల్ఫీ..

బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 48 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా ఈ ఫొటోను పంచుకున్నాడు గోపిచంద మలినేని. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్​ కాగా, బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమా విషయానికొస్తే ఇందులో దునియా విజయ్​ పవర్​ ఫుల్ విలన్​ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

 కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్​కుమార్..

కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్​కుమార్..

అలాగే బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్​లో వస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్​ కుమార్, నవీన్​ చంద్ర కీలక పాత్రలు పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​ పతాకంపై నవీన్​ యెర్నేని, వై రవిశంకర్​ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

 డైలాగ్​ రైటర్​గా సాయి మాధవ్​..

డైలాగ్​ రైటర్​గా సాయి మాధవ్​..

ఇక బాలయ్య బాబు సినిమా అంటే డైలాగ్​లకు పెట్టింది పేరు. అందుకు మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్​ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్​ క్రాఫ్ట్​మెన్​ నవీన్​ నూలి ఎడిటింగ్​ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఎన్​బీకే 107 ఫస్ట్​ హంట్​ టీజర్​ గూస్ బంప్స్​ తెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X