twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి దశలో 'భీష్మ'.. హైదరాబాద్‌లో నితిన్, రష్మిక రొమాన్స్!

    |

    యంగ్ హీరో నితిన్ వెండితెర ప్రయాణం సాఫీగా సాగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఆయన.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలను ఓకే చెప్పేశాడు. అందులో ఒకటి భీష్మ. ఈ సినిమాలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

    ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముగింపు దశకు చేరింది. ఇటీవలే హైదరాబాదులో నితిన్, రష్మిక జంటపై ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేశారు. మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ప్రథమార్థంలో భీష్మను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

    Nithiin and Rashmika Mandanna Spotted in hyderabad Regarding..

    ఇటీవలే దీపావళి కానుకగా విడుదలైన భీష్మ పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. దీంతో సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, నితిన్ రొమాంటిక్ సీక్వెన్స్ హైలైట్ కానుందని తెలుస్తోంది.

    సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన 'సింగల్ ఫరెవర్' అనే క్యాప్షన్ చూస్తుంటే నేటితరం యువతకు ఓ సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఇటు రష్మిక, అటు నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో అఫీషియల్ విడుదల తేదీ ప్రకటించనుంది చిత్రయూనిట్.

    English summary
    Young hero Nithiin new movie titled as Bhishma. which is directed by Venky Kudumula. In this movie Rashmika Mandanna act as heroine. Director Venky Kudumula reveals the look of Nithiin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X