లాంఛనంగా ప్రారంభమైన 'రాజుగారి గది 3'.. దిల్ రాజు క్లాప్

హారర్ జోనర్ సినిమాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది 'రాజుగారి గది' సినిమా. యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చేసిన థ్రిల్ ప్రేక్షక లోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో సీక్వల్స్ మొదలు పెట్టాడు ఓంకార్. 'రాజుగారి గది' రెండో భాగంగా 'రాజుగారి గది 2' వచ్చింది. నాగార్జున, సమంత లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో తాజాగా 'రాజుగారి గది 3' పేరుతో మరో సినిమా మొదలు పెట్టాడు యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్.

మిల్కీ బ్యూటీ తమన్నా, అశ్విన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నేడు (జూన్ 20) ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఓంకార్ దర్శకత్వంలో ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై 'రాజుగారి గది 3' సినిమా నిర్మితం కానుంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌, గౌతంరాజు ఎడిటింగ్‌, సాహి సురేశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

 Omkars Raju Gari Gadhi 3 Starts In Hyderabad

రేపటి నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. తొలి షెడ్యూల్ హైద‌రాబాద్‌ లోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం కొన్ని అందమైన, థ్రిల్లింగ్ లొకేషన్స్ ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. గత రెండు సినిమాను మించి హారర్, కామెడీ ఈ సినిమాలో జోడించనున్నారని తెలుస్తోంది. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తామని అంటోంది చిత్ర యూనిట్.

More from Filmibeat

Read more about: omkar ఓంకార్ tamannah
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X