Kannappa: ప్రభాస్ లుక్ లీక్.. షాక్ అవుతున్న మంచు ఫ్యాన్స్..

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాపులర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరుస భారీ బడ్జెట్ మూవీస్ హిట్ కావడంతో పుల్ జోష్ లో ఉన్నారు. అలాగే.. ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈ తరుణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రముఖ సంస్థ హోంబలే (Hombale Films) ఫిలిమ్స్ తో ఒక్కసారి మూడు పాన్ ఇండియా సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బిగ్ మూమెంట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో భారీ షాకిచ్చే లీక్ జరిగింది. ఇంతకీ ఏ మూవీ నుండి ప్రభాస్ లుక్స్ లీక్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు? ఆ వివరాల్లోకెళ్తే..

బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీలతో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా వరుస విజయాలు అందుకుని యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా హీరోగా మారారు. ఈ జోష్ తో వరుస సినిమాలతో బిజీగా మారారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ 'రాజా సాబ్' షూటింగ్ లో బిజీగా ఉంటారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మూవీ తరువాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' సినిమాలో నటించనున్నారు. ఈ మూవీ కూడా సెట్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనున్నారు.

Pan India star Prabhas look leaked from Manchu Vishnu s Kannappa movie

ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్'(Spirit)మూవీలో నటించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నది. ఈ మూవీ ప్రి ప్రొడక్సష్ పనుల్లో బిజీబిజీగా మారారు సందీప్ రెడ్డి వంగా. ఇలా వరుస సినిమాలతో డార్లింగ్ ప్రభాస్ బిజీగా మారారు. ఈ తరుణంలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలను నిర్మించిన సంస్థ హోంబాలే ఫిలింస్ (Homable Films)తో ప్ర‌భాస్‌ బిగ్ డిల్ కుర్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ క్రేజీ మూవెంట్ ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ప్రభాస్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చేలా ఓ లీక్ జరిగింది. ఇంతకీ ఏ మూవీలో అనుకున్నారా? ఆ సినిమా ఏదో కాదు. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా. ఈ భారీ బడ్జెట్ మూవీలో పాన్ ఇండియా వైడ్ గా చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నంది అనే పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయినట్టు తెలుస్తోంది.

లీక్ అయినా ఈ ఫోటోలో ప్రభాస్ లాంగ్ హెయిర్ తో.. నుదుట విభూతి పెట్టుకొని, మెడలో భారీ రుద్రాక్ష మాలలు, భుజంపై ఎర్రని కండువా వేసుకొని కనిపిస్తున్నాడు. అలాగే చేతిలో ఓ ఆయుధం పట్టుకుని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లుక్స్ నెటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఓవైపు ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ లుక్స్ ను చూసి సంతోషిస్తుంటే.. మరికొందరు మాత్రం.. కన్నప్ప మూవీ యూనిట్ ఇంత కేర్ లెస్ గా వ్యవహరిస్తుందేంటీ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిమైనా ఈ విషయంలో మూవీ మేకర్స్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

More from Filmibeat

Read more about: kannappa manchu vishnu prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X