#PKSDT లో కన్ను గీటిన పిల్ల.. మరో హీరోయిన్ ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా వినోదయ సితం రీమేక్ ఇటీవల లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ సభ్యులు నేడు స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పనులు కాస్త ఆలస్యం కావడంతో ఇప్పుడు సెట్స్ పైకి వచ్చింది.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీడియా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సముద్రఖని యాక్షన్ చెబుతున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ షూటింగ్ అప్డేట్ అయితే ఇచ్చేసారు.

Pawan kalyan and sai dharam tej new project shooting going in swift mode

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ షూటింగ్ షిఫ్ట్ మోడ్ లో ఉంది అంటూ.. డైరెక్టర్ సముద్రఖని యాక్షన్ మోడ్ లో ఉన్నారు అని తెలియజేశారు. ఇక రెగ్యులర్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి అని చిత్ర యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకు విశ్వప్రసాద్ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అలాగే జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

Pawan kalyan and sai dharam tej new project shooting going in swift mode

ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ప్రధానపాత్రలో నటిస్తుండగా కేతిక శర్మ సాయిధరమ్ తేజ్ కు జోడిగా కనిపించబోతోంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబొతున్నట్లు సమాచారం. అలాగే శ్రీ లీల ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

ఇక మిగతా పాత్రదారులలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో మరికొన్ని విభిన్నమైన పాత్రలు కూడా హైలెట్ కానున్నాయట. PKSDT ప్రాజెక్ట్ కు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలి అని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మరి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X